ప్ర: ఒక మనిషి ఎన్ని జన్మలు ఎత్తుతాడు? ప్రతి జన్మలోను మనిషి గానే పుడతాడా ?.
జ: ప్రతి మనిషి తన ఆత్మ పరమాత్మ(భగవంతుడు) లో లీనం అయ్యేవరకు జన్మిస్తూనే ఉంటాడు.
ఒక్కసారి పరమాత్మలో లీనం అయ్యిన తరువాత మరలా జన్మ ఎత్తరు.
మానవుడు ప్రతి జన్మలోను మనిషిగా పుట్టాల్సిన ఆవశ్యకత లేదు. తన యొక్క ప్రవర్తనను బట్టి
తదుపరి జన్మ ఉంటుంది. ప్రతి మనిషిలోను మూడు గుణాలు సత్వ, రజో, తమో గుణాలు ఉంటాయి.
కానీ ఇవి సమ పాళ్ళలో ఉండవు. ఎవరైతే తమో గుణాలు అధికంగా కలిగి అంటే అరాచకాలు, హత్యలు చేస్తూ జంతు
ప్రవుర్తి కలిగి మనిషి జన్మ యొక్క గొప్పతనాన్ని గుర్తించరో వారు తదుపరి జన్మలో మనిషిగా పుట్టే
అర్హత కోల్పోతారు.
No comments:
Post a Comment